Posts

Hartog Committee 1929

  హార్టాగ్‌ కమిటీ (1929) ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో ఉపాధ్యాయుల కోసం విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలి 1919లో రౌలత్‌ చట్టాన్ని బ్రిటిష్‌వారు ఏర్పాటు చేశారు రౌలత్‌ చట్టం పనితీరును మెరుగుపరచడం, విద్యను కూడా ఒక అంశంగా చేరుస్తూ 1927లో సైమన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సైమన్‌ గో బ్యాక్‌ అనే నినాదంతో ఉద్యమం ఈ కమిషన్‌లో ఢాకా యూనివర్సిటీలో పని చేసిన సభ్యుడు- సర్‌ ఫిలిప్‌ హార్టాగ్‌. వీరు ప్రాథమిక విద్య ముందుకు కొనసాగకపోవడానికి గల కారణాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలు, రవాణా, సౌకర్యాలు లేకపోవడం, పేదరికం, నిరక్షరాస్యత, కులం, మతం, అనారోగ్యం ప్రధాన కారణం వీటితో పాటు వృథా/అపవ్యయం/వేస్టేజ్‌ అంటే మధ్యలో చదువు మానేయడం, దీన్ని నియంత్రించడానికి పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి. స్తబ్దత/నిలుపుదల/Stagnation- అంటే ఒకే తరగతిలో ఎక్కువ కాలం కొనసాగడం. అందువల్ల ఉపాధ్యాయులకు నాణ్యతతో కూడిన శిక్షణ, అర్హతలను పెంచడంతో పాటువేతనాలను పెంచాలి ఉన్నత పాఠశాల స్థాయిలో వాణిజ్య, పారిశ్రామిక కోర్సులను ప్రవేశపెట్టాలి. యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు పెంచి గ్రంథాలయాలు స్థాపించాలి. 1921లో ప్రా...

Sadler Commission Report of 1917 Calcutta University Commission

శాడ్లర్‌ కమిషన్‌ (1917)  1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఏర్పడిన సమస్య అధ్యయనం కోసం లీడ్స్‌ యూనివర్సిటీ వీసీ అయిన మైఖేల్‌ శాడ్లర్‌ను అధ్యక్షుడిగా, సర్‌ ఫిలిప్‌ హార్టాగ్‌ మొదలైనవారు సభ్యులుగా ఏర్పాటు చేశారు కలకత్తా సమస్యను పరిష్కరించడానికి ఢాకాలో కూడా విశ్వవిద్యాలయం ఉండాలి దీర్ఘకాలిక వీసీ (ఉపకులపతి) ఉండాలి వీరు ఇతర యూనివర్సిటీలకు కూడా సూచనలు చేశారు 10+2+3 విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు. ఇంటర్మీడియట్‌ను వేరు చేస్తూ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఉండాలని సూచించారు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ఆరోగ్య వ్యాయామ శాఖ) ఉండాలని సూచించారు యూనివర్సిటీలో సాంకేతిక విద్య కోర్సులు ఉండాలని సూచించారు సెనెట్‌ను కోర్టుగా పరిగణించాలి అదేవిధంగా సిండికేట్‌ను ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌గా పరిగణించాలి మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ మినహా ఇతర సబ్జెక్టులను మాతృ భాషలో బోధించాలి.

1913 British New Eduation Policy

  బ్రిటిష్‌వారి నూతన విద్యా విధానం పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. గ్రామీణ, పట్టణ ప్రాంత పాఠశాలలకు వేర్వేరు ప్రణాళికలు 1:30/1:40 ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఉపాధ్యాయులు స్థానిక భాషలో నిష్ణాతులై ఉండాలి మాధ్యమిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి, వేసవిలో శిక్షణా తరగతులు సెకండరీ విద్యను ప్రైవేటీకరణ చేయాలి, విశ్వవిద్యాలయాల విద్యా వ్యాప్తిలో భాగంగా 185 కళాశాలలను స్థాపించాలి.

Gopala Krishna Gokhale (1910-1911)

  గోపాలకృష్ణ గోఖలే (1910-1911) వీరు పుణె ఫెర్గూసన్‌ కళాశాలలో పని చేశారు. Servents of India Society స్థాపకర్త. Imperial legislative council లోని సభ్యుడు 6-10 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికి ప్రాథమిక విద్య ఉచితంగా అందించాలి ఈ ప్రస్థావన 1910లో ఒకసారి, 1911లో మరోసారి తీసుకొచ్చారు. అమాయకులు, నిరక్షరాస్యులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు, పోటీపడలేదు. స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో ఖర్చులు భరించాలి. స్థానిక ప్రభుత్వాలు సెస్‌ (Tax) ద్వారా వనరులు సమకూర్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకే ఒక శాఖ, ప్రత్యేక కార్యదర్శిని నియమించారు. పాఠశాలకు పంపని తల్లిదండ్రులను శిక్షించాలి. గోపాలకృష్ణ గోఖలేకు ప్రేరణ గైక్వాడ్‌ మహారాజ్‌ . (1893-94)లో బరోడా సంస్థానంగా పిలవుబడే శాయాజీరావు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ 1906 నాటికి బరోడా సంస్థానం మొత్తం అమలు చేయాలి. గోపాలకృష్ణ గోఖలే అనుసరించిన చట్టాలు బ్రిటిష్‌ యాక్ట్‌-1870, 1877, 1880 పటేల్‌ యాక్ట్‌ అనే పేరుతో 1918 బొంబాయి మున్సిపాలిటీ అమలు చేసింది. 3. గోఖలే తీర్మానంలో ముఖ్యాంశం? 1. ఉచిత వి...

Indian Universities Commission 1902

విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్‌(1902) 1897 నుంచి 1902 వరకు కరువు, ప్లేగు వ్యాప్తి చెందడంతో విద్య లేని కారణంగా నిశ్శబ్ద కాలం అయ్యింది. 1899లో లార్డ్‌ కర్జన్‌ ప్రవేశం 1901లో భారతీయులు లేకుండా భారతీయ విద్యపై సిమ్లాలో మొదటి విద్యా సమావేశం (రహస్యంగా) నిర్వహించారు. ఈ సమావేశంలో 150 అంశాలను ప్రస్తావించగా ప్రధాన అంశం ప్రాథమిక విద్య అందువల్ల లార్డ్‌కర్జన్‌ 1904లో ఎలిమెంటరీ పాఠశాల నిర్వహణ కోసం ఉపాధ్యాయుల నియామకం కోసం నిధులు విడుదల చేశారు. థామస్‌ ర్యాలీ అధ్యక్షతన 1902లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1904లో భారతీయుల కోసం భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి సెనెట్‌, సిబ్బంది నియామకం కోసం సిండికేట్‌ ఉండాలని సూచించారు ఈ కాలంలో నాణ్యమైన మాధ్యమిక విద్యపై విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం, విదేశాంగ శాఖలో ఉన్న విద్యాశాఖను ప్రత్యేక విద్యాశాఖగా మార్పు చేశారు లార్డ్‌కర్జన్‌ ప్రభుత్వ ఉద్యోగాలు రానివారికి ప్రైవేటు ఉద్యోగాలకు అనుమతి లేవని ప్రకటించారు. ఉన్నత విద్యా లక్ష్యం కేవలం ఉద్యోగాల కల్పన కోసం అంటూ గోపాలకృష్ణ గోఖలే దీన్ని వ్యతిరేకించారు.

Jyoti Ba Pule

  జ్యోతిబా ఫులే 1850వ సంవత్సరాన్ని మహిళా విద్య పునర్జన్మ ఏర్పడిన/ఎత్తిన సంవత్సరంగా పేర్కొంటారు-1850 1851లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలలు స్థాపించారు. అంటరానితనం నిర్మూలన కోసం పోరాడారు. అందుకే ఈయనను మహాత్మా, భారతదేశ క్రాంతి కారుడు అని, మహారాష్ట్ర మార్టిన్‌ లూథర్‌ అని పేర్కొంటారు. వీరు రచించిన గ్రంథం ‘బ్రాహ్మణాచే కసబ్‌’ జ్యోతిబాఫులే నా గురువు అని అంబేద్కర్‌ పేర్కొన్నారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు- సావిత్రిబాయి ఫులే

Indian History - Mauryan Empire

  14. బలం ద్వారా గెలవడం కంటే ధమ్మ (ధర్మం) ద్వారా గెలవడం మేలని నమ్మినవారు? 1) శాంతమూలుడు 2) వరహమిహిరుడు 3) అశోకుడు 4) బింబిసారుడు 15. అధికారులు ఎలా పనిచేస్తున్నారనే అంశాన్ని సమాచారాన్ని రాజుకు అందించేవారు? 1) వేగులు 2) దూతలు 3) గవర్నర్లు 4) మహామాత్రులు 16. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధానికి స్వస్తి పలికిన రాజు పరిపాలన ఏ సామ్రాజ్యానికి చెందింది? 1) మౌర్య 2) మగధ 3) శాతవాహనులు 4) 1, 2 17. మౌర్య సామ్రాజ్యంలో గల ప్రాదేశిక రాజధానుల్లో సరైనవి? 1) నలంద, తక్షశిల, ఉజ్జయిని 2) గయ, పాటలీపుత్ర, తక్షశిల 3) తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి 4) కశ్మీర్‌, పానిపట్టు, ఉజ్జయిని 18. మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగంగా లేనిది? ఎ) హిందూకుష్‌ పర్వతాలు బి) గంగా, యమున లోయలు సి) మాళ్వా పీఠభూములు డి) కృష్ణ, గోదావరి లోయ 1) ఎ, బి 2) బి మాత్రమే 3) సి, డి 4) ఎ, డి 39. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొదటి రాజు ఎవరు? 1) చంద్రగుప్త మౌర్యుడు 2) కనిష్కుడు 3) అశోకుడు 4) గౌతమీపుత్ర శాతకర్ణి