విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

 

1. థార్న్ డైక్‌ CAVD ప్రజ్ఞా పరీక్షలో C అనే అక్షరం సూచించే సామర్థ్యం?
    1) వాక్య పూరణం
    2) అవగాహన
    3) పదజాలం
    4) పద ధారాళత
2. వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను విశ్లేషించుకుని నివేదించే పద్ధతి?

    1) పరిశీలనా పద్ధతి

    2) వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి

    3) ప్రయోగాత్మక పద్ధతి

    4) అంతఃపరిశీలనా పద్ధతి

3. ఒక 9 ఏండ్ల బాలుడు.. 8 ఏండ్ల బాలుడికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తిచేయగలిగినట్లయితే

అతని ప్రజ్ఞాలబ్ధి?

    1) 112.5

    2) 88.8

    3) 102.5

    4) 98.8

4. కింది వాటిలో వికాస లక్షణం కానిది?

    1) గుణాత్మకమైనది

    2) సమగ్రమైనది

    3) అంతర్గతమైన చర్య

    4) ఒక ప్రత్యేకాంశానికి పరిమితం

5. ఏ రకమైన బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు సంరక్షకుల అవసరంగల వికలాంగులుగా పరిగణించబడుతారు?

    1) స్వల్ప బుద్ధిమాంద్యులు

    2) మిత బుద్ధిమాంద్యులు

    3) తీవ్ర బుద్ధిమాంద్యులు

    4) అభ్యసన వైకల్యంగలవారు

6. పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని

చెప్పినవారు?

    1) జాన్‌ డ్యూయీ

    2) టెర్మన్‌

    3) థార్న్‍డైక్‌

    4) జీన్‌ పియాజె

7. వ్యక్తిని చతురునిగా, సాత్విక స్వభావునిగా, మానసిక స్థిరత్వం కలిగినవాడిగా తయారుచేసే హార్మోన్‌లను

స్రవించే గ్రంథి?

    1) అవటు గ్రంథి

    2) పార్శ అవటు గ్రంథి

    3) పిట్యూటరీ గ్రంథి

    4) అడ్రినల్‌ గ్రంథి

8. వ్యక్తి శారీరక ఆత్మప్రతిమ, మానసిక ఆత్మప్రతిమ పరిపక్వత చెందే దశ?

    1) బాల్యదశ

    2) కౌమార దశ

    3) మధ్య వయస్సు

     4) వయోజన దశ

9. ఒక అబ్బాయికి చదవడం ఇష్టం లేదు, అలాగని పరీక్షలో ఫెయిల్‌ అవడమూ ఇష్టం లేదు – ఇక్కడి సంఘర్షణ?

    1) ఉపగమ – ఉపగమ

    2) ద్వి ఉపగమ – పరిహార

    3) పరిహార – పరిహార

    4) ఉపగమ – పరిహార

10. ఎరిక్సన్‌ ప్రకారం సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక, ఉత్పాదక కృత్యాల్లో పాల్గొనే వ్యక్తుల

మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి?

    1) ఉత్పాదకత Vs స్తబ్దత

    2) సన్నిహితత్వం Vs ఏకాంతం

    3) శ్రమించడం Vs న్యూనత

    4) చిత్తశుద్ధి Vs స్తబ్దత

11. ఐస్క్రీమ్‌ ఇస్తానంటే చదువుకుంటాననే పిల్లవాడి నైతిక దశ?

    1) 3వ దశ – సాంప్రదాయ స్థాయి

    2) 2వ దశ – పూర్వసాంప్రదాయ స్థాయి

    3) 1వ దశ – పూర్వసాంప్రదాయ స్థాయి

    4) 4వ దశ – సాంప్రదాయ స్థాయి

12. ఉన్నట్లుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లవాడిలా ఏడవటంలో రక్షకతంత్రం?

    1) ప్రక్షేపణం

    2) ప్రతిగమనం

    3) పరిహారం

    4) దమనం

13. వైగోట్‌స్కీ ప్రకారం పిల్లలు..

    1) పునర్బలనం ఇచ్చినప్పుడే నేర్చుకుంటారు

    2) పెద్దలు, సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు

    3) అనుకరణ ద్వారా నేర్చుకుంటారు

    4) అంతర్‌దృష్టి ద్వారా నేర్చుకుంటారు

14. పావ్‌లోవ్‌ ప్రయోగంలో గంట శబ్దంతోపాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది.

దీన్ని కింది విధంగా చూపవచ్చు.

    1) CR+CS – UCR

    2) UCS+CS – CR

    3) UCS+UCR – CR

    4) CS+UCS – UCR

15. 25 అర్థరహిత పదాలుగల జాబితాను శ్రీధర్‌ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. రెండు నెలల

తర్వాత మళ్లీ అదేజాబితాను తిరిగి నేర్చుకొమ్మనగా అతను 16 ప్రయత్నాలు తీసుకున్నాడు.

శ్రీధర్‌ పొదుపు గణన?

    1) 16 శాతం

    2) 4 శాతం

    3) 20 శాతం

    4) 40 శాతం

16. మాస్లోవ్‌ ప్రకారం.. దాదాపు అందరు వ్యక్తులు మొదట సంతృప్తిపర్చుకోవడానికి

ప్రయత్నించే అవసరం?

    1) శారీరక అవసరం

    2) రక్షణ అవసరం

    3) ప్రేమ, సంబంధిత అవసరం

    4) గుర్తింపు అవసరం

17. అభ్యసనం గురించి సరైన ప్రవచనం?

    1) అభ్యసన అభ్యాసకుని ఉద్వేగాలతో ప్రభావితం కాదు

    2) అభ్యసనకు పరిపక్వతతో సంబంధం లేదు

    3) అభ్యసనం పరిపక్వత, ఉద్వేగాలచే ప్రభావితమవుతూ ఉంటుంది

    4) అభ్యసన మన ప్రవర్తనలో కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది

18. సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు?

    1) ద్విపార్శ బదలాయింపు

    2) శూన్య బదలాయింపు

    3) ప్రతికూల బదలాయింపు

    4) అనుకూల బదలాయింపు

19. తిరోగమన అవరోధంలో..

    1) గతంలో నేర్చుకున్న విషయం ప్రస్తుతం అభ్యసన ధారణపై ప్రభావం చూపుతుంది

    2) ప్రస్తుత అభ్యసన, గత అభ్యసనమును పునఃస్మరణ చేయడంలో ఆటంకం కలిగిస్తుంది

    3) ప్రస్తుత అభ్యసన, గత అభ్యసన పునఃస్మరణకు సాయపడుతుంది

    4) ప్రస్తుత అభ్యసన పునఃస్మరణపై గత అభ్యసన ప్రభావం ఉండదు

20. ఫలిత సూత్రాన్ని ప్రతిపాదించినవారు?

    1) వాట్సన్‌

    2) థార్న్‍డైక్‌

    3) పావ్‌లోవ్‌

    4) బండూరా

21. అభ్యాసకుడు స్థిరమైన జీవిత తత్వాన్ని దేని ద్వారా అభివృద్ధిపర్చుకుంటాడు?

    1) హస్తలాఘవం

    2) స్వభావీకరణ

    3) భావన నిర్మాణం

    4) శీలస్థాపన

22. ఆకృతీకరణ భావన దేనికి సంబంధించినది?

    1) శాస్త్రీయ నిబంధన

    2) కార్యసాధక నిబంధన

    3) అంతర్‌దృష్టి అభ్యసన

    4) యత్నదోష సిద్ధాంతం

23. బుద్ధిమాంద్యుల విద్యలో పునర్బలనంతో సంబంధం లేనిది?

    1) క్రమీణ ఆస్తిత్వం     

    2) ఆకృతీకరణ

    3) గొలుసు విధానం   

     4) త్వరణం

24. సహభాగి, సహకార అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం?

    1) విద్యార్థులు నేర్చుకునే విషయానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది

    2) ఉపాధ్యాయుల విషయజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది

    3) ఉపాధ్యాయుల మధ్య పరస్పర చర్యలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది

    4) విద్యార్థుల మధ్య పరస్పర చర్యలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది

25. ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం?

    1) బ్రూనర్‌ బోధనా సిద్ధాంతం

    2) థార్న్‍డైక్‌ యత్న-దోష సిద్ధాంతం

    3) బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం

    4) స్కిన్నర్‌ కార్యసాధక నిబంధన సిద్ధాంతం

26. బోధనా విషయం విద్యార్థులకు అందించే హెర్బర్ట్‍ సోపానం?

    1) సన్నాహం

     2) సంసర్గం

    3) సమర్పణ

    4) అన్వయం

27. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు నిర్ధారించిన

ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి?

    1) 1:25     

    2) 1:30

    3) 1:35         

    4) 1:40

28. నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్టు పనులకు ఇచ్చిన భారత్వం?

    1) 10 శాతం     

    2) 20 శాతం

    3) 30 శాతం     

    4) 40 శాతం

29. కింది వాటిలో జాతీయ విద్యాప్రణాళికా చట్రం – 2005లో పనివిద్యకు సంబంధించిన

భావన కానిది?

    1) పనివిద్య సంస్థాగతం చేయబడాలి

    2) పనివిద్య ద్వారా నైపుణ్యంగల పనివారిని తయారు చేయడం

    3) ఉత్పత్తిదాయక పనిని జ్ఞాన సంపాదనకు బోధనా మాధ్యమంగా మలచాలి

    4) పనివిద్య బళ నైపుణ్యాల సాధనకు సాయపడాలి

30. మార్గదర్శనం గురించి తప్పు ప్రవచనం?

    1) సర్దుబాటు సమస్యలుగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం

    2) చదువుపట్ల అనాసక్తిగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం

    3) కుటుంబ సమస్యలుగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం

    4) పాఠశాలపట్ల ప్రతికూల వైఖరిగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం


Comments

Popular posts from this blog

Prime & Composite Numbers

Why students hate maths?