Pallava Dynasty


1. పల్లవులు విదేశీయులు అని వాదించిన చరిత్రకారుడు?
1) నీలకంఠ శాస్త్రి 2) పరబ్రహ్మశాస్త్రి
3) లూయిస్‌ రైస్‌ 4) వి.ఎ.స్మిత్‌

2. మహా పల్లవ వంశ స్థాపకుడు?
1) సింహవిష్ణువు 2) మహేంద్రవర్మ
3) రవివర్మ 4) నరసింహవర్మ

3. సింహవిష్ణువు పట్ల తమిళభూమిలో అణచివేతకు గురైనవారు?
1) కలభ్రులు 2) ఆనంద గోత్రజులు
3) ఇక్షాకులు 4) విష్ణుకుండినులు

4. మహా పల్లవుల కాలంలో కృష్ణాప్రాంతాన్ని ఏ విధంగా పిలిచేవారు?
1) పుల్లలూర్‌ 2) కర్మరాష్ట్రం
3) కోనసీమ 4) లాటరాజ్యం

5. నీలకంఠశాస్త్రి ప్రకారం సింహవిష్ణు పరిపాలనా కాలం?
1) క్రీ.శ. 550-92
2) క్రీ.శ. 550-60
3) క్రీ.శ. 550-70
4) క్రీ.శ. 555-90

6. సింహవిష్ణువు తండ్రి?
1) సింహవర్మ 2) ఆదిత్యవర్మ
3) మహేంద్రవర్మ 4) నరసింహవర్మ

7. ఏ బాదామి చాళుక్య రాజుతో సింహవిష్ణువు పోరాడాడని కొందరు చరిత్ర కారులుభావించారు?
1) మొదటి పులకేశి
2) రెండో పులకేశి
3) కీర్తివర్మ 4) మంగళేశుడు

8. సింహవిష్ణువు ఆరాధించే దేవుడు?
1) ఇంద్రుడు 2) బ్రహ్మ
3) వినాయకుడు 4) విష్ణువు

9. సింహవిష్ణువు ఆస్థాన కవి?
1) దండి 2) భారవి
3) పొన్న 4) రన్న

10. కిరాతార్జునీయం అనే సంస్కృత రచన ఎవరి కృతి?
1) కాళిదాసు 2) భారవి
3) దామోదర కవి 4) పంపకవి

11. మహాబలిపురంలో ఆదివరాహ గుహలో ఉన్న ప్రతిమలు?
1) లక్ష్మి-దుర్గ 2) చండీ-లక్ష్మీ
3) పార్వతి-సరస్వతి
4) పైవేవీకాదు

12. క్రీ.శ. 600 – 630 వరకు పరిపాలించిన పల్లవరాజు?
1) సింహవర్మ
2) మొదటి మహేంద్ర వర్మ
3) నరసింహవర్మ
4) సింహవిష్ణువు

13. కాంచీపురం ఏ నదీ తీరాన ఉంది?
1) కృష్ణా 2) కావేరి
3) ప్రాణహిత 4) వేగవతి

14. ‘గుణభర’ అనే బిరుదు పొందిన పల్లవరాజు?
1) సింహవిష్ణువు
2) మొదటి మహేంద్రవర్మ
3) నరసింహవర్మ
4) రెండవ మహేంద్రవర్మ

15. ఏ పల్లవరాజు తొలిసారిగా తొండైమండ లంలో గుహాలయాలు నిర్మించాడు?
1) సింహవిష్ణువు
2) మొదటి పరమేశ్వరవర్మ
3) మొదటి మహేంద్రవర్మ
4) రెండో మహేంద్రవర్మ

16. మొదటి మహేంద్రవర్మకు సమకాలీనుడైన బాదామి చాళుక్య రాజు?
1) మొదటి పులకేశి
2) రెండవ పులకేశి
3) కీర్తివర్మ 4) మంగళేశుడు

17. పుల్లలూరు యుద్ధం ఎవరి మధ్య జరిగింది?
1) నరసింహవర్మ- కీర్తివర్మ
2) మొదటి మహేంద్రవర్మ –
రెండో పులకేశి
3) సింహవిష్ణువు – జయసింహుడు
4) రెండో మహేంద్ర వర్మ-విష్ణు వర్థనుడు

18. సిత్తన్న వాసల్‌కు చెందిన చిత్రలేఖనాలు ఎవరి కాలం నాటివి?
1) మొదటి మహేంద్ర వర్మ
2) రెండో మహేంద్రవర్మ
3) దంతివర్మ 4) రాజసింహ

19. మొదటి మహేంద్రవర్మ రచించిన గొప్ప గ్రంథం?
1) మత్తమహిమ 2) మత్తమాధుర్యం
3) మత్తసంభూతి
4) మత్త విలాస ప్రహసనం

20. శివభక్తుడైన అప్పర్‌ ప్రోద్బలంతో పల్లవ రాజైన మొదటి మహేంద్రవర్మ శైవుడిగా మారాడు. కానీ ప్రారంభంలో అతడుఆచరించిన మతం?
1) జైనం 2) బౌద్ధం
3) హిందూమతం 4) వైష్ణవం

21. మొదటి మహేంద్రవర్మ బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువులకు గుహాలయాలు కట్టించాడని తెలిపిన శాసనం?
1) కాంచీపుర శాసనం
2) మహేంద్రవాడి శాసనం
3) తిరుచునాపల్లి శాసనం
4) మండగపట్టు శాసనం

22. మొదటి మహేంద్రవర్మ కొండచరియలను తొలిపించి ఎక్కడ గుహాలయం నిర్మించలేదు?
1) మామండూరు 2) తిరుపతి
3) దళవానూరు 4) మహేంద్రవాడి

23. మొదటి మహేంద్రవర్మ ఎవరి వద్ద సంగీతం నేర్చుకున్నాడు?
1) వీణాచార్యుడు 2) బ్రహ్మశాస్త్రి
3) రుద్రాచార్యుడు 4) కోటాచార్యుడు

24. మొదటి మహేంద్ర వర్మ నిర్మించిన పెద్ద తటాకం (చిత్రమేఘ) ఉన్న ప్రాంతం?
1) కాంచీపురం 2) మహాబలిపురం
3) మామండూరు 4) మహేంద్రవాడి

25. మామల్లపురంలోని పంచపాండవ రథాల నిర్మాత?
1) మొదటి మహేంద్రవర్మ
2) మొదటి నరసింహవర్మ
3) భీమవర్మ 4) రవి కీర్తి

26. పల్లవుల కాలంనాటి శిల్పాల్లో గంగావత రణం అతి ప్రధానమైంది. దీన్ని రాతిలో రచించిన ఒక శాస్త్రీయ పద్య కావ్యం అని ఏ చరిత్ర కారుడు అన్నాడు?
1) వి.ఎ.స్మిత్‌
2) నేలటూరి వెంకటరమణయ్య
3) పరబ్రహ్మ శాస్త్రి
4) నీలకంఠ శాస్త్రి

27. మహామల్లుడనే బిరుదు ధరించిన పల్లవరాజు?
1) మొదటి మహేంద్రవర్మ
2) మొదటి నరసింహవర్మ
3) గోవింద వర్మ 4) కీర్తివర్మ

28. సింహళదేశంలో సింహాసనంపై మారవర్మను పునఃప్రతిష్ఠ చేసింది?
1) మొదటి మహేంద్రవర్మ
2) మొదటి నరసింహవర్మ
3) కంపవర్మ 4) రవికీర్తి

29. మొదటి నరసింహవర్మ బాదామి చాళుక్యుల సైన్యాలను ఏ యుద్ధంలో ఓడించాడు?
1) పుల్లలూరు 2) కాంచీపురం
3) మణిమంగళం
4) నర్మదానది తీరాన

30. వాతాపి కొండ బిరుదు ధరించిన రాజు?
1) అపరాజిత వర్మ
2) మొదటి నరసింహవర్మ
3) రెండో పరమేశ్వర
4) నృపతుంగవర్మ

31. మొదటి నరసింహవర్మ కాలంలో పల్లవరాజ్యంలో సంచరించిన చైనా బాటసారి?
1) ఫాహియాన్‌ 2) ఇత్సింగ్‌
3) హ్యుయాన్‌త్సాంగ్‌
4) పైవేవీకాదు

32. కాంచీపురం ఘటికలో వైదిక విద్యలను అభ్యసించిన బౌద్ధ తర్కశాస్త్రవేత్త?
1) సుందరమూర్తి 2) మహావీర
3) దిజ్ఞాగుడు 4) మౌనవ్రతుడు

33. పల్లవుల కాలం నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం?
1) కాంచీపురం 2) మండనూరు
3) తిరుచునాపల్లి 4) మహాబలిపురం

34. భైరవ కొండలో ఉన్న గుహాలయ నిర్మాత?
1) మొదటి మహేంద్రవర్మ
2) మొదటి నరసింహవర్మ
3) రవి వర్మ 4) కీర్తివర్మ

35. రాజసింహ బిరుదాంకితుడైన పల్లవరాజు ఎవరు?
1) నందివర్మ
2) రెండో నరసింహవర్మ
3) భీమ వర్మ
4) పైఎవరూ కాదు

36. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ ఆలయ నిర్మాత?
1) మొదటి మహేంద్రవర్మ
2) మొదటి నరసింహవర్మ
3) మూడో మహేంద్రవర్మ
4) రాజసింహుడు (రెండోనరసింహవర్మ)

37. జగద్గురు శంకరాచార్యులు ఏ పల్లవరాజుకు సమకాలీనుడంటారు?
1) మొదటి మహేంద్రవర్మ
2) మొదటి నరసింహవర్మ
3) రాజసింహుడు
4) సింహవిష్ణువు

38. రెండో పరమేశ్వర వర్మ పరిపాలనా కాలంలో ఏ బాదామి చాళుక్య రాజు కంచిలో ప్రవేశించాడు?
1) రణరాగుడు 2) కీర్తివర్మ
3) యువరాజు రెండో విక్రమాదిత్యుడు
4) జయసింహ

39. ఏ శాసనం పల్లవ ప్రభుత్వ మంత్రివర్గాన్ని పేర్కొన్నది?
1) మండగపట్టు శాసనం
2) తిరుచునాపల్లి శాసనం
3) వైకుంఠ పెరుమాళ్‌ శాసనం
4) పైవేవీకాదు

40. చైనాదేశ చక్రవర్తి వద్దకు రాయబారం పంపిన పల్లవరాజు?
1) రాజసింహుడు
2) మొదటి పరమేశ్వరవర్మ
3) రెండో పరమేశ్వర వర్మ
4) మొదటి నందివర్మ

41. బాహూర్‌ తామ్ర శాసనం ఏ రాజుకు చెందినది?
1) గోవిందవర్మ 2) అపరాజితవర్మ
3) నృపతుంగవర్మ 4) కంపవర్మ

42. రెండో నందివర్మ సేనాధిపతి ఎవరు?
1) జయచంద్రుడు 2) శ్రీఉదయుడు
3) భానుచంద్రుడు
4) ఉదయ చంద్రుడు

43. పల్లవ ప్రభువుల చిహ్నం ఏది?
1) అశ్వం 2) రథం
3) వృషభం 4) సూర్యుడు

44. హ్యుయాన్‌త్సాంగ్‌ కాంచీపురంలో ఎన్ని సంఘారామాలున్నాయని పేర్కొన్నారు?
1) 50 2) 200
3) 150 4) 100

45. పల్లవుల కాలంలో గూఢచారులను ఏ పేరుతో పిలిచేవారు?
1) సంజరంతకులు 2) దూతికలు
3) అమాత్యులు 4) పైఎవరూకాదు

46. అష్టాదశపరిహార అనే పన్నులు ఏ దక్షిణాపథ చక్రవర్తులు వసూలు చేశారు?
1) వేంగీచాళుక్యులు 2) పల్లవులు
3) నవీన చోళులు
4) బాదామిచాళుక్యులు

47. పల్లవుల కాలంలో మహామల్లపురంతోపాటు విదేశీ వ్యాపారంలో కీలక పాత్ర వహించిన మరో ఓడరేవు పట్టణం?
1) కాంచీపురం 2) నాగపట్టణం
3) పుల్లలూరు 4) దళవానూర్‌

48. స్వతంత్ర చోళవంశ స్థాపకుడు ఎవరు?
1) మొదటి పరాంతకుడు
2) విజయాలయుడు
3) రెండోపరాంతకుడు
4) రాజేంద్రుడు

49. విజయాలయ చోళుని కుమారుడెవరు?
1) మొదటి ఆదిత్యుడు
2) మొదటి రాజేంద్రుడు
3) వీర చోళుడు
4) రెండో ఆదిత్యుడు

50. విజయాలయుడు ఎక్కడ విశుంభసూదినీ (దుర్గ) ఆలయాన్ని నిర్మించాడు?
1) కాంచీపురం 2) మధురై
3) తంజావూరు 4) ఉత్తరమేరూర్‌

51. చివరి పల్లవ రాజైన అపరాజితవర్మను వధించి కాంచీపురం ఆక్రమించిన చోళరాజు?
1) విజయాలయుడు
2) మొదటి పరాంతకుడు
3) మొదటి ఆదిత్య చోళుడు
4) రాజరాజు

52. ఏ చోళ చక్రవర్తి మధురైకొండ బిరుదు ధరించారు?
1) ఆదిత్య చోళుడు
2) రాజరాజు
3) మొదటి పరాంతకుడు
4) రాజేంద్రుడు

53. మొదటి పరాంతకుడు వల్లాల యుద్ధంలో (క్రీ.శ.916) ఓడించిన రాష్ట్రకూట రాజు?
1) దంతిదుర్గుడు
2) మొదటి గోవిందుడు
3) రెండో కృష్ణుడు
4) రెండో విజయాలయుడు

54. చాళుక్య-చోళుల పాలన ఏ రాజుతో ప్రారంభమైంది?
1) రాజాధిరాజు
2) కుళోత్తుంగచోళుడు
3) ఆది రాజేంద్రుడు
4) వీర రాజేంద్రుడు

55. తక్కోలం యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) క్రీ.శ. 945 2) క్రీ.శ. 950
3) క్రీ.శ. 946 4) క్రీ.శ. 949

66

Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?