మాధ్యమిక విద్యా కమిషన్ (1950-53)
- మన విద్యా యంత్రాంగంలో మాధ్యమిక విద్య బలహీనంగా ఉంది, దీన్ని సంస్కరించడం ఆవశ్యకం అని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ సిఫారసు చేయడంతో లక్ష్మణస్వామి మొదలియార్ మద్రాస్ యూనివర్సిటీ వీసీ అధ్యక్షుడిగా CABE ఏర్పాటు చేసిన రెండో కమిషన్.
- 1952, సెప్టెంబర్ 23న ఈ కమిషన్ నియమించగా 1954, ఆగస్టు 27న నివేదికను సమర్పించారు.
- మాధ్యమిక విద్యపై సమాచారం కోసం వీరు TOUR పర్యటన పద్ధతి, ప్రశ్నావళి పద్ధతులను వినియోగించారు.
- ప్రాథమిక విద్యను, విశ్వవిద్యాలయాల విద్యను అనుసంధానపరిచే మాధ్యమిక విద్య.
- సాటి మనిషితో హుందాతో కలిసి జీవించడానికి తగిన లక్షణాలను అలవాటు చేయని విద్య విద్యే కాదు.
- పుస్తక జ్ఞానం కంటే వృత్తి విద్యల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించాలి.
- విద్యా విధానం 5+3+4+3 గా ఉండాలి.
- 5- 1-5 తరగతులు- Jr. Basic
- 3-6-8 తరగతులు- Sr.Basic/Jr.Secondary
- 4- 9-12 తరగతులు- హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్
- 3- డిగ్రీ విద్య
- హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ – 7 గ్రూప్స్. భాష, సైన్స్, సాంఘికశాస్త్రం, క్రాఫ్ట్ (చేతి పనులు) మొదలైన ప్రధాన సబ్జెక్టులతో పాటు వీరు కింది 7 గ్రూప్స్‌ను ప్రతిపాదించారు.
- మానవీయ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విద్య, వాణిజ్య విద్య, వ్యవసాయం, లలిత కళలు, గృహ శాస్త్రం. ఈ ఏడు గ్రూప్స్ నుంచి తప్పనిసరిగా 3 గ్రూప్స్ ఎంపిక చేసుకోవాలి.
- మొదలియార్ దృష్ట్యా మాధ్యమిక విద్య అంటే 11 నుంచి 17 సం.ల వయస్సు గలవారికి అందించే 7 సం.ల విద్య.
- HSE స్థాయిలో బహుళార్థ సాధక పాఠశాలలు ఉండాలి.
- సాంకేతిక విద్య కోసం పరిశ్రమలపై సాంకేతిక విద్య పన్ను విధించాలి.
- తగిన కోర్సులను ఎంపిక చేసుకోవడానికి మార్గదర్శక కేంద్రాలు ఉండాలి.
- విద్యను వృత్తిపరం చేయాలి
- ఆధునిక, శాస్త్రీయ, ప్రాజెక్ట్, యాక్టివిటీ (కృత్యాధార), విరామ సమయ సద్వినియోగం వంటి పద్ధతులతో బోధించాలి.
- బాలికలకు గృహశాస్త్రం సదుపాయం ఉండాలి.
- HCE వరకు మాతృభాష, కేంద్ర ఉద్యోగాల కోసం హిందీ తప్పనిసరి సబ్జెక్టు.
- నాయకత్వ లక్షణాల కోసం NCC, SCOUT, Jr.Redcross వంటి కార్యక్రమాలు ఉంటాయి.
- పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షలు, స్కూల్ ఆఫ్ మెడికల్ సర్వీస్ ఉండాలి.
- జాతీయ స్థాయిలో వ్యాయామ విద్య శిక్షణా సంస్థలు ఉండాలి.
- కంపార్ట్‌మెంటల్ పరీక్షలు ఉండాలి.
- ఒక సబ్జెక్టుకు ఒకటి కంటే ఎక్కువ పాఠ్యపుస్తకాలు ఉండాలి.
- పాఠశాలల్లో గ్రంథాలయాలు, శిక్షణ పొందిన లైబ్రేరియన్, గ్రంథాలయాలు, మేధావి ప్రయోగశాలలు ఉండాలి
- మెట్రిక్ ఆపై అర్హత కలవారిని 2 సం.లు, డిగ్రీ అర్హత కలవారికి సం. ఉపాధ్యాయ శిక్షణ.
- మెట్రిక్- 2 సం.లు DED
- డిగ్రీ- 1 సం. BED
- శిక్షణ సమయంలో టీచింగ్ ప్రాక్టీస్, వర్క్‌షాప్ నిమిత్తం ఫీజు ఉండాలి.
- ఉపాధ్యాయ నియామకాలు దేశవ్యాప్తంగా ఏకరీతిగా ఉండాలి.
- సర్వీసులోని ‘ఉపాధ్యాయులకు ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్’ అంటే ప్రమోషన్, పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ (బీమా సౌకర్యం)
- వీరి పిల్లలకు ఉచిత విద్య, హోదా పెంపునకు సన్మానాలు ఉండాలి.
- పదవీ విరమణ- 60 స.లు
- ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు బోధన చేయకూడదు.
2. మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం?
1. 1953 2. 1986
3. 1921 4. 1931
3. మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన మాధ్యమిక విద్యా లక్ష్యం?
1. వృత్తి సామర్థ్యం మెరుగుపరచుట
2. మూర్తిమత్వ అభివృద్ధి
3. పౌరసత్వ శిక్షణ
4. పైవన్నీ
4. సెకండరీ విద్యా కమిషన్‌గా పిలివబడేది?
1. మొదలియార్ కమిషన్
2. రాధాకృష్ణన్ కమిషన్
3. రామ్మూర్తి కమిషన్
4. మాల్కం ఆది శేషయ్య కమిటీ
2. నిలుపుదల, స్తబ్దతను అరికట్టడానికి సూచించిన కమిషన్?
1. ఈశ్వరీబాయి పటేల్ కమిషన్
2. మొదలియార్ కమిషన్
3. యశ్‌పాల్ కమిటీ
4. కొఠారీ విద్యా కమిషన్
Comments
Post a Comment