CDP - యత్నదోష అభ్యసన సిద్ధాంతం
1890లో విలియం జేమ్స్ రూపొందించిన Principles of Psychology అనే గ్రంథం చదివి ప్రభావితుడైన అమెరికాకు చెందిన ఈ.ఎల్. థార్న్‌డైక్ అనే శాస్త్రవేత్త 1911లో Animal Intelligence అనే గ్రంథాన్ని ప్రచురించారు. అనేక తప్పులు చేయడం, వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యసనం జరగడాన్నే యత్నదోష అభ్యసనం అంటారు. ప్రేరణ, ప్రతిస్పందనల మధ్య దృఢమైన బంధం ఏర్పడటం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. జంతువుల పై అనేక ప్రయోగాలు చేసి, ' అ భ్యసన ప్రక్రియను' ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధంగా వివరించారు. అభ్యసన సిద్ధాంతాల్లో థార్న్‌డైక్ రూపొందించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సిద్ధాంతంలో ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య నాడీ సంధానం జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని సంసర్గ వాద సిద్ధాంతం/ సంధానవాద సిద్ధాంతం/ ఉద్దీపన-ప్రతిస్పందన సిద్ధాంతం/ బంధనాల సిద్ధాంతం/ సుఖదుఃఖాల సిద్ధాంతం/ S-R-Type ప్రాధాన్యత సిద్ధాంతం, విజయ పథ వరణరీతి సిద్ధాంతంగా పేర్కొంటారు. ఈ సిద్ధాంతాన్ని విద్యాచరణలోనూ, శిక్...