Indian Geography - Wild-life
వైవిధ్యభరిత వన్యప్రాణులు విస్తృతంగా ఉన్న దేశం భారత్. ఇక్కడ మాత్రమే జీవించే ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. ఆసియాటిక్ సింహాలు, రాయల్ బెంగాల్ పులులు, ఒంటికొమ్ము ఖడ్గమృగాలు, ఏనుగులు, చిరుతలు, మొసళ్లు, సరీసృపాలు, పక్షిజాతులు తదితర వన్యప్రాణులన్నీ దేశ సహజ వారసత్వ సంపదగా వర్థిల్లుతున్నాయి. పర్యావరణ సమతౌల్యానికే కాకుండా పర్యాటకానికి కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ వన్యప్రాణులు, వాటి సహజ ఆవాసాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. పర్యావరణ వ్యవస్థలను, వన్యప్రాణులను సంరక్షించేందుకు ఏర్పాటైన జాతీయ పార్కులు, అభయారణ్యాలు, ప్రాజెక్ట్ టైగర్ తరహా ప్రత్యేక విధానాలు, వాటి పరిధి, ఫలితాలను సమగ్రంగా తెలుసుకోవాలి. వన్యప్రాణులు దేశంలోని భౌగోళిక భిన్నత్వం, విభిన్న వాతావరణ పరిస్థితులు, పర్యావరణ వైవిధ్యం నేపథ్యంలో వివిధ అడవి జంతువులు, పక్షులు, కీటకాలకు సహజ ఆవాసాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలోని మొత్తం జంతు జాతుల్లో (15 లక్షలు) దేశంలో సుమారు 6.7% (81,251) రకాలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త ఎస్.హెచ్.ప్రేటర్ (1934) ప్రకారం భారతదేశాన్ని ఆరు జంతు- భౌగోళిక ప్రాంతాలు...